ఉగ్రవాదుల ఘాతుకం.. 300 మందికి పైగా కిడ్నాప్!

ఉగ్రవాదుల ఘాతుకం.. 300 మందికి పైగా కిడ్నాప్!

ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో గల 'ఎన్గోషె' పట్టణంపై ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో పాటు 300 మందికి పైగా వ్యక్తులను అపహరించారు. ముగ్గురు బోకో హరామ్ కమాండర్లను సైన్యం హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సైన్యం ఇతర ప్రాంతాల్లో దాడులను తిప్పికొట్టినప్పటికీ, ఈ భారీ కిడ్నాప్ స్థానికంగా పెను కలకలం రేపింది.