'బద్వేల్ డివిజన్‌లో 13,496 పాస్ పుస్తకాలు'
KDP: బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 58 గ్రామాల్లో రీ-సర్వే జరిగింది. ఈ గ్రామాలకు సంబంధించి 13,496 పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేసేందుకు మంజూరైనట్లు RDO చంద్రమోహన్ తెలిపారు. మైదుకూరు 593, బ్రహ్మంగారిమఠం 3504, బీ.కోడూరు 1798, కలసపాడు 4134, పోరుమామిళ్ల 994, బద్వేలు 498, గోపవరం 435, అట్లూరు 603, శ్రీ అవధూతకాశి నాయన 937 పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ చేయనున్నారు.