ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎల్లారెడ్డి ఆర్డీవో

KMR: ఎల్లారెడ్డి మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆర్డీవో పార్థ సింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను ఫార్మసిస్ట్ అధికారి రాథోడ్‌ను అడిగారు. స్టాఫ్‌నర్స్ పోస్ట్ ఖాళీగా ఉందని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనీ కోరారు.