VIDEO: ప్రభుత్వ బడిలో పుస్తకాలు చిందరవందరం

VIDEO: ప్రభుత్వ బడిలో పుస్తకాలు చిందరవందరం

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపెల్లి ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. నిన్న స్కూల్‌కు సెలవు రావడంతో విద్యార్థులు ఈరోజు ఉదయం పాఠశాలకు వెళ్లగా 8వ తరగతి గది తాళాలు పగలగొట్టి ఉన్నాయి. గదిలోని పుస్తకాలు అన్ని చిందర వందరగా పడి ఉన్నాయి. ఫర్నీచర్, డిజిటల్ టీవీ రిమోట్‌ను ధ్వంసం చేశారని విద్యార్థులు తెలిపారు.