"సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రలు కీలకం"
JN: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ రమ్య-రాఘవరెడ్డిని, పలువురు మహిళలను శాలువులతో ఘనంగా సత్కరించారు. సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.