పెట్రోల్ బంకుల వద్ద 'NO STOCK' బోర్డు
TG: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌లో ఇంధన సరఫరాపై పడుతోంది. ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ కొరత రాగా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌పైనా ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద 'నో స్టాక్' బోర్డు దర్శనమిచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో దేశంలో తీవ్ర ఇంధన సంక్షోభం ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.