ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

ATP: రాయదుర్గం బీఎస్పీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఆదివారం ముఖ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలతో మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ సెక్టార్, బూత్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 18న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.