'పారిశుద్ధ్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు'
NDL: ఆత్మకూరు పట్టణంలో రోడ్లపై కుప్పలు కుప్పలుగా మురికి చెత్త కుప్పలు దర్శనమిస్తూ దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలతో పట్టణ ప్రజలు అల్లాడుతున్నారని CPM సీనియర్ నాయకులు రాజశేఖర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.