స్త్రీ శక్తి మహిళలకు స్వీట్లు పంపిణీ

ELR: నూజివీడు ఏపీఎస్ఆర్టీసీ డిపో నుంచి 'స్త్రీ శక్తి' పథకంలో ఉచితంగా ప్రయాణించిన మహిళలకు శుక్రవారం రాత్రి స్వీట్లు, జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు బీజేపీ పట్టణ అధ్యక్షురాలు ఎం.నాగరాణి, మాజీ కౌన్సిలర్ కొంపెల్ల కృష్ణకుమారిలు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మహిళా కానుకగా 'స్త్రీ శక్తి' పథకంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు.