భైరవేశ్వర ఆలయం హుండి ఆదాయం లెక్కింపు
KDP: నల్లచెరువు పల్లె సమీపంలోని భైరవేశ్వర ఆలయం హుండీ ఆదాయం రూ.5.60 లక్షలు సమకూరింది. ఆలయ ఆవరణలో ఈవో రమణ, ఆలయ కమిటీ ఛైర్మన్ ఓవి రమణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఆదాయాన్ని లెక్కించగా రూ. 5.60 లక్షలు వచ్చినట్లు ఈవో రమణ, ఛైర్మన్ ఓవి రమణారెడ్డిలో తెలిపారు. ఇన్ క్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, పాల్గొన్నారు.