గంజాయి మొక్కలు స్వాధీనం

ADB: ఇంటి ఆవరణలో పెంచుతున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సోనాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్ వివరాల ప్రకారం.. పార్ది-కె గ్రామానికి చెందిన సోలంకి గులాబ్‌సింగ్ తన ఇంటి ఆవరణలో అయిదు గంజాయి మొక్కలు చౌహాన్ రాంసింగ్ మూడు గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.