ఢిల్లీలో గుంటూరు యువకుడు మృతి

GNTR: చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ కుమార్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన దేవాంశ్ వీరిద్దరు స్నేహితులు. వీరు ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని ఓ వసతి గృహంలో ఉంటున్నారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. దేవాంశ్ అనే యువకుడు తన స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపి, తనను తాను తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.