కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనం వద్ద అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి అధికారులకు, ప్రజలకు అగ్ని ప్రమాదాల రకాలు, వాటిని ఆర్పే పద్ధతులు, కిచెన్, ఎలక్ట్రికల్ సేఫ్‌టీపై వివరించారు. డీఆర్‌వో ఏ.మలోల, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, అధికారులు పాల్గొన్నారు.