HIT NEWS కథనానికి స్పందన..
WGL: భూపతి మల్లంపల్లి గ్రామంలోని రైతు వేదిక మందుబాబుల అడ్డాగా మారిన వివరాలు నిన్న HIT News లో వెలుగుచూశాయి. ఈ వార్తపై స్పందించిన అధికారులు నేడు సంఘటనా స్థలానికి చేరుకొని వేదికను పరిశుభ్రం చేసి, తిరిగి రైతుల ఉపయోగానికి అందుబాటులో ఉంచేలా చర్యలు ప్రారంభించారు. స్థానికులు దీనిని అభినందిస్తూ.. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని కోరుతున్నారు.