'గతంకంటే మెరుగ్గా ఈ సారి గణేష్ నిమజ్జన ఏర్పాట్లు'

నెల్లూరు: నగర కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఈరోజు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కమీషనర్, వివిధ శాఖల అధికారులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గణేష్ ఘాట్‌లో నిమజ్జనానికి ఒక చక్కటి ప్రణాళికతో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సలహాలను తీసుకుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.