నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపుకు అవకాశం
GNTR: గుంటూరు సర్కిల్ పరిధిలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు నెలాఖరు నేపథ్యంలో ఆదివారం కూడా పనిచేస్తాయని సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిజిటల్ చెల్లింపులు కూడా చేయవచ్చని అన్నారు. విద్యుత్ వినియోగదారులు విషయాన్ని గమనించి సకాలంలో బిల్లులు చెల్లించాలని సూచించారు.