అత్యాచారం కేసు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
TG: HYDలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన అత్యాచారం కేసులో LBనగర్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు మహేందర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,100 జరిమానా విధించింది. బాధితురాలిని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినందుకు గాను, ఆమెకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.