సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

KDP: సిద్ధవటం మండల ప్రజా పరిషత్ సభా భవనంలో శనివారం మండల అధ్యక్షురాలు జ్యోతి వెంకటమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. పలు అంశాలపై సంబంధిత అధికారులు సమాచారాన్ని చదివి వినిపించారు.