VIDEO: ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్

VIDEO: ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్

KKD: ఈవీఎం, వీవీపాట్స్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రెవిన్యూ, ఎన్నికలు అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.