జలకళ సంతరించుకున్న నల్లచెరువు

జలకళ సంతరించుకున్న నల్లచెరువు

WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలోని నల్లచెరువు పూర్తిగా నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఎంతో కీలకమైన ఈ చెరువు నిండటంతో చెన్నూరు, తాండ గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు నీటి కొరత తీరుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండు కుండలా మారడంతో ఆ ప్రాంతమంతా జలకళ కనిపిస్తోంది.