చౌదర్పల్లి ZPHS పాఠశాలలో ఘనాంగ గణిత దినోత్సవం
VKB: చౌదర్పల్లి ZPHS పాఠశాలలో ఇంఛార్జ్ హెచ్ఎం రవీందర్, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు క్విజ్, గణిత నమూనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థులు గణితంపై భయం వీడి, పట్టుదలతో రాణించాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.