పత్తి కొనుగోలు చేయాలి: CITU
GDWL: రైతుల వద్ద ఉన్న పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని, మొంథా తుఫాను బాధిత రైతులకు నష్ట పరిహారాన్ని వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం గద్వాల్ జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలో సోమవారం కాటన్ మిల్ దగ్గర కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ.. ప్రతి రైతు పంటను కొనుగోలు చేయాల్సిందేనని, లేదంటే ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలిపారు.