'మౌలిక సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యం'

'మౌలిక సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యం'

MBNR: జిల్లా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని గోల్ మస్జిద్ ప్రాంతంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వార్డుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పాల్గొన్నారు.