మాజీ ప్రధాని కుమారుడి సంచలన ప్రసంగం
జెనీవాలో జరిగిన UNHRC సమావేశంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ పాక్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన తండ్రిని వేధించడం ఆపి, వెంటనే విడుదల చేసేలా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని కోరారు. అయితే, ఇది దేశ GSP+ హోదాను దెబ్బతీసే ‘దేశ వ్యతిరేక కుట్ర’ అని ప్రభుత్వం మండిపడింది. ఖాసింకు ఇజ్రాయిల్ లాబీ, నిషేధిత BLAతో సంబంధాలు ఉన్నాయని మంత్రులు ఆరోపించారు.