VIDEO: తిరుపతి జిల్లాలో అతి పెద్ద కార్తీక దీపం
TPT: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని యోగులపర్వతంపై అత్యంత పెద్దదైన కార్తీకదీపాన్ని బుధవారం సాయంత్రం వెలిగించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరితో పాటు 50 కిలోమీటర్లు కనిపించేలా 1503 కేజీల నెయ్యి, 2వేల మీటర్ల ఒత్తితో దీనిని వెలిగించడం విశేషం. కొండపై దీపం వెలిగించిన తర్వాత పరిసర గ్రామాల్లోని మహిళలు తమ ఇంటి ముందు దీపారాధన చేశారు.