VIDEO: వైద్య అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కృష్ణా: గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వైద్య అధికారులకు సూచించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ల వైద్య అధికారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్షించారు.