కార్యకర్తల సమావేశానికి మంత్రి వీరాంజనేయ స్వామి పిలుపు

ప్రకాశం: కొండపిలోని సీతారామ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 9 గంటలకు జరగనున్న కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి కార్యకర్తలను హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మారీ టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కూడా పాల్గొంటారని మంత్రి శుక్రవారం తెలిపారు.