'మత్స్యకారులకు ఐస్ బాక్సులు అందజేత'
NTR: మత్స్యకారుల సౌకర్యార్థం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఐస్ బాక్సులను అందజేశారు. కృత్తివెన్ను మండలం గరిశపూడి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి వీటిని అందజేశారు. ఓఎన్జీసీ సంస్థ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఈ ఐస్ బాక్సులను సమాకూర్చింది.