రచ్చబండపై కూర్చొని సామాన్య ప్రజలతో ముచ్చటించిన ఎమ్మెల్యే

రచ్చబండపై కూర్చొని సామాన్య ప్రజలతో ముచ్చటించిన ఎమ్మెల్యే

జనగాం: లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రచ్చబండ దగ్గర సామాన్య వ్యక్తి వలె కూర్చొని గ్రామస్తులు, రైతులతో కాసేపు ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సమస్య ఉందని చెప్పడంతో సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలన్నారు.