నిజామాబాద్‌లో దొంగల ముఠా అరెప్ట్
NZB: నిజామాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు రూరల్ టౌన్ SHO శ్రీనివాస్ తెలిపారు. బైంసాకు చెందిన హైమద్ హుస్సెన్, అబూబకర్ ప్రధాన నిందితులుగా చోరీ చేసిన వస్తువులను నాంపల్లి వెంకటాచారి, సాయిచరణ్‌కు విక్రయించేవారని వివరించారు. పట్టణంలోని రూరల్ PS పరిధిలో చోరిలు జరిగాయని, వారి వద్ద నుంచి 70 గ్రాముల బంగారం, వెండి, గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.