అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

SKLM: జాతీయ రహదారిపై వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస పోలీసులు గురువారం పట్టుకున్నారు. బరంపురం వైపు నుండి విజయనగరం వైపుకు తీసుకు వెళ్తుండగా మందస జాతీయ రహదారిపై మందస ఎస్సై కె కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు వాహనాలలో 6 గేదెలు, 3 ఆవులు, 3 లేగ దూడలను పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.