ప్రజావాణిలో 135 దరఖాస్తులు

ప్రజావాణిలో 135 దరఖాస్తులు

KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 135 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేసి వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.