గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తా: తుమ్మల

KMM: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల అన్నారు. గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలంలోని బాలపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన పామాయిల్ రైతుల సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పనిచేసానని చెప్పారు.