ఆళ్లగడ్డలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
NDL: ఆళ్లగడ్డలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ఇవాళ వరుసగా రెండో రోజు విస్తృత సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని, వెంటనే అధికారులు కార్యాలయ తలుపులు మూసివేసి, ప్రజలను లోనికి రానివ్వకుండా సోదాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.