విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: దుత్తలూరు మండలం కొత్తపేటలో ఘనంగా అడివి పేరంటాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయన్నారు.