MPDOలతో కలెక్టర్ సమీక్ష
JN: జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా మంగళవారం MPDOలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు పోలింగ్ మెటీరియల్ పంపిణీ వంటి అంశాలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.