కేంద్ర మంత్రిని కలిసిన అమలాపురం ఎంపీ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్, ఇతర సమస్యలను, జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కోరారు. ఈ మేరకు కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. రావులపాలెం నుండి అమలాపురం వరకు జాతీయ రహదారి రూపకల్పనకు అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.