గిల్‌ను దాటేసిన హోప్

గిల్‌ను దాటేసిన హోప్

వెస్టిండీస్ ప్లేయర్ షాయ్ హోప్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్‌ను అధిగమించాడు. ఈ ఏడాది 3 ఫార్మాట్ల(టెస్ట్+వన్డే+T20)లో 47 ఇన్నింగ్స్ ఆడిన అతను 1749 రన్స్ చేయగా.. శుభ్‌మన్ 40 ఇన్నింగ్స్‌ల్లో 1736 పరుగులు చేశాడు. జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ 1585(46 ఇన్నింగ్స్) మూడో స్థానంలో ఉన్నాడు.