వైద్యులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్యాధికారి

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్యాధికారి

SRD: వర్షాలు తగ్గుముఖం పట్టినందున సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శుక్రవారం ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.