ప్రమాదకరంగా కరెంట్ స్తంభం

నెల్లూరు: రూరల్ 36వ డివిజన్ బట్వాడీపాలెంలో ఓ కరెంట్ స్తంభం పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. నిత్యం ఈ మార్గంలో వందలాది వాహనాలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్తంభం కింద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభాన్ని మార్చాలని స్థానికులు కోరుతున్నారు.