'30 ఏళ్లు వారంతా పరీక్షలు చేయించుకోవాలి'

VZM: 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని, శుక్రవారం గంట్యాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత సూచించారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కొటారుబిల్లి జంక్షన్ వరకు వైద్యాధికారిణి హేమలత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.