హైదరాబాద్‌లో ఈద్ జోష్.. చార్మినార్ కళ కళ

హైదరాబాద్‌లో ఈద్ జోష్.. చార్మినార్ కళ కళ

HYD: హైదరాబాద్‌లో ఈద్ జోష్ నెలకొంది. రంజాన్ ముగింపు సందర్భంగా చార్మినార్ పరిసరాలు జన సందోహంతో కిక్కిరిశాయి. రాత్రి బజార్లలో వెలుగుల కాంతులు, ప్రార్థనలు, షాపింగ్‌తో పాతబస్తీ సందడి చేసింది. ప్రత్యేక అలంకరణలు, సంప్రదాయ వాతావరణం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశ వీక్షణలో చార్మినార్ చుట్టూ విస్తరించిన జన సముద్రంతో పండుగ వైభవాన్ని ప్రతిబింబించింది.