వలపు వల.. పాక్‌కు సున్నిత సమాచారం చేరవేత!
సైనికుల సున్నిత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగితో పాటు మహిళను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరూ పాక్ ఏజెంట్లకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. వీరిని సైన్యంలోని కీలక అధికారులు బదిలీలపై సమాచారం ఇవ్వాలని పాక్ నిఘా సంస్థ ప్రలోభపెట్టినట్లు గుర్తించారు. వివరాల కోసం సైనిక సిబ్బందిని హనీట్రాప్ చేయాలని ఆ మహిళకు చెప్పినట్లు చెప్పారు.