ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
కృష్ణా: మచిలీపట్నంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి కలెక్టర్ బాలాజీ బుధవారం పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ' ఒక కుటుంబం -ఒక వ్యాపారవేత్త 'అనే నినాదంతో ముందుకు సాగుతోందని, ముస్లిం సోదరులలో ఎవరైనా వ్యాపారవేత్తలు కావడానికి ముందుకొస్తే, వారికి ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు.