వరి నాట్లు వేసి నిరసన తెలిపిన CPM నాయకులు

NGKL: వంగూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం నాయకులు సోమవారం రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో ప్రజలు రోడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోడ్లపై నీరు నిలిచి అనేక ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వం స్పందించి సీసీ రోడ్లు, డ్రైనేజీ బాగు చేయాలని కోరారు.