చిన్నారులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్
KMR: మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలోని పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ బుధవారం సందర్శించారు. పిల్లల చదువుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మెనూ ప్రకారం.. విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం పాఠశాల చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్‌రాజు పాల్గొన్నారు.