పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మండలం కళ్లేపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నారిమణి పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ శిబిరంలో మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి మందులు అందజేశారు.