VIDEO: ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

WNP: ఆత్మకూర్‌లోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. దుకాణంలో ఏ రకం ఎరువులు ఉన్నాయి? ఎంత నిల్వలు ఉన్నాయి? బోర్డుపై రాసిన నిల్వలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం అయిన నిల్వలను పరిశీలించారు. సూచిక బోర్డుపై నికర నిల్వలు రాసి పెట్టాలని, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని దుకాణం యజమానిని ప్రశ్నించారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసున్నారు.