దీక్షా దివాస్ వేడుకల ఏర్పాట్ల పరిశీలన
BDK: కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో రేపు ఉదయం 9 గంటల నుంచి దీక్షా దివాస్ వేడుకలు జరగనున్నాయి. జిల్లా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.