మచిలీపట్నం చారిత్రక నగర విశేషాలు
కృష్ణా: జిల్లా కేంద్రమైన మచిలీపట్నం (బందరు) చారిత్రక వాణిజ్యానికి ప్రధాన నిలయం. 17వ శతాబ్దంలోనే బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వర్తకులు ఇక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా తన కలంకారీ అద్దకపు కళకు, నోరూరించే బందరు లడ్డుకు ప్రసిద్ధి. ఇక్కడి పోర్టు పునరుద్ధరణ పనులతో మచిలీపట్నం మళ్లీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది.